![]() |
![]() |

బిగ్ బాస్ తెలుగు సీజన్-9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ పేరు తెరపైకి వచ్చింది. (Shrasti Verma)
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రష్టి వర్మ అందరికీ సుపరిచితమే. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో.. మీడియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొద్దిరోజులు జైలు జీవితం కూడా గడిపాడు. (Bigg Boss 9 Telugu)
జానీ మాస్టర్ కేసుతో శ్రష్టి వర్మ పేరు చాలారోజులు మీడియా, సోషల్ మీడియాలో నానింది. ఆ సమయంలో ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా చేసింది. సినిమాల్లోనూ నటిగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.
శ్రష్టి వర్మ ఇంటర్వ్యూలను గమనిస్తే.. ఆమె ఒక ఫైటర్ అని, స్ట్రాంగ్ లేడీ అని అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌస్ అంటేనే వివాదాలు, గొడవలకు పెట్టింది పేరు. మరి బిగ్ బాస్ హౌస్ లో శ్రష్టి వర్మ ఎలా ఆడబోతుంది? తనలోని అసలుసిసలైన ఫైటర్ ని చూపించబోతుందా? అనేది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.
![]() |
![]() |